![Image](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhnc9bQgdII2FJo-Mx4Adr_nix-P8CxZm83BrL7wyiJtR0FHPGtdU5uT9a-Qdrcjgt96mjD5CiKWABN6EwLBY5YTdIQwU6yQq7aViL9R1QdRVWOdKwqXy3H-y9c4ev7cqrcQsg9DXsfsZI0BLIRKlh1DPeiH7o--J5DezuSnROrr0ATO2gJzXmiIgZqWw/s320/jendalamma%202.jpg)
ఆదివాసీ స్త్రీ సాధికార జెండా చల్లపల్లి స్వరూపరాణి స్త్రీవాదం అన్నీ అమరిన వంటింటి గుమ్మం ముందే ఆగిపోయింది. అది వంటగదిలో, లేబర్ రూములో స్వేచ్చకోసం తండ్లాడి పవిటల్ని తగలెయ్యడంలో చాలాకాలం తలమునకలైంది. వంటి నిండా కప్పుకోడానికి గుడ్డలు లేని, మూడురాళ్ళ పొయ్యిల బాధలు పెత్తందారీ కులాల స్త్రీవాదులకు అర్ధం కావు. రెక్కలుముక్కలు చేసుకుని సంపాదించిన ‘ఆడకూలీ’ డబ్బులతో సారాయి తాగొచ్చి రోజూ తన్నే మొగుడితో పాటు పెత్తనదారీ కులాల పురుషులవల్ల శ్రమదోపిడీతో పాటు లైంగిక దోపిడీకి గురయ్యే దళిత ఆదివాసీ స్త్రీల వెతలపై స్త్రీవాదం మాట్లాడదు. మాట్లాడుతున్నామని ఈమధ్య కొందరు మాటకారులు కొత్తగా దబాయిస్తున్నారు. స్త్రీవాదం తన పోరాటంగా చెప్పుకునే సారా వ్యతిరేక ఉద్యమంలో నల్లమల అటవీ గ్రామాల ఆదివాసీ చెంచు జాతి మహిళలు సైతం సారా నిషేధం కోసం రోడ్డెక్కి తమదైన ఉద్యమాన్ని నిర్మించారని ఎంతమందికి స్త్రీవాదులకు తెలుసు? నల్లమల అడవిలో ఉండే అనేక చెంచు పెంటల్లో(గ్రామాలు) ‘హటకేశ్వరం’ ఒకటి. ఈ గ్రామం శ్రీశైల ముఖద్వారం నుంచి దేవస్థానానికి వెళ్ళేదారిలో రోడ్డు పక్కనే ఎడమవైపు ఉంటుంది. అక్కడ మొత్తం ...