Posts

Showing posts from December, 2018

'వేకువపిట్ట' పై ప్రస్థానం

Image

'వేకువపిట్ట' పై అరుణతార

Image

ఆంధ్ర జ్యోతి 'వేకువ పిట్ట' సమీక్ష

Image

prajasakti on 'Vekuva pitta' ప్రవీణ్ వెలువోలు

Image

Aranya Krishna on 'Vekuva Pitta' in Matruka

Image
సందేశాత్మక వేకువ పిట్ట! అరణ్యకృష్ణ   ఇంతటి సామాజిక దుఃఖాన్ని , ఆక్రోశాన్ని నింపుకున్న కవిత్వాన్ని ఈ మధ్య కాలంలో చదవలేదు.   ఇందులో ఉన్నది సానుభూతి కాదు , సహానుభూతీ కాదు.   ఉన్నదల్లా గుండెపగుళ్ళ అనుభవానికి అక్షర రూపమివ్వటమే.   కులానికి-వివక్షకీ , కులానికి-ఆర్ధిక దారిద్ర్యానికి వున్న అవినాభావ సంబంధాన్ని కవి తన కవిత్వంతోకి తీసుకొచ్చిన తీరు గొప్పది.   ఊరుకీ-వాడకీ మధ్యనున్న వైరుధ్యంతో కూడిన స్వానుభవాలే కవిత్వాంశాలు ఈ కవికి.   ఇది చల్లపల్లి స్వరూపరాణి కవితల సంపుటి "వేకువ పిట్ట".    **** మనం తరగతి గదుల్లో చరిత్ర అంటే ఏం చదువుకున్నాం ?   మొత్తం భరతజాతి ఒకటిగా వున్నట్లు , ఎవరో విదేశీయులు సిల్క్ రూట్లో గుర్రాలేసుకొచ్చి , లేదా సముద్రం మీద భారీ ఓడలేసుకొచ్చి ఈ దేశాన్ని దోచుకున్నట్లు మాత్రమే చదువుతాం.   కానీ ఇదే గడ్డ మీద రకరకాల సమూహాలున్నాయని , అందులో కొన్ని సమూహాలు కొన్ని వేల సంవత్సరాల తరబడి పుట్టుకని బట్టి ప్రయోజనాన్ని పొంది మరికొన్ని సమూహాల్ని అదే పుట్టుక కారణంతో దోచుకున్నాయని , హింసించాయని , ఆ దోచుకునే కారణానికి , వివక్షకి కులం అనే నెపం వున్నదని , ఆ నెపంకి మన

Ganteda Gowrunaidu on 'Vekuva pitta'

Image
తానే ఒక వేకువ పిట్టయి గంటేడ   గౌరు నాయుడు అమ్మ చీర కొంగు నుంచి ప్రపంచాన్ని చూసి కవిత్వం చెప్పడమంటే గుండె ఘోషను ఆవిష్కరించడమేనని, ఆత్మగౌరవ పరిరక్షణ, ఆత్మగౌరవ ప్రకటన అని, జీవితమే కవిత్వానికి ముడిసరుకుగా స్వీకరించి తనదైన అను భూతిని అక్షరీకరించి తన అక్షరాల్ని మన కళ్ళలో ఎర్రజీరలుగా, అశృధారలుగా మార్చగలిగే సక్తివంతురాలైన కవిగా సాక్షాత్కరిస్తుంది చల్లపల్లి స్వరూపరాణి. దళిత ఉద్యమం కుల, వర్గ అణచివేత గురించి మాట్లాడిందని, దళిత పురుషుల కోణం నుంచి ఎక్కువగా మాట్లాడిందని, స్త్రీవాద ఉద్యమం మధ్య తరగతి అగ్రకుల మహిళల గురించే మాట్లాడిందని అనుకుంటే పీడితులలోకెల్లాపీడితులైన దళిత మహిళా తన గురించి తానూ మాట్లాడవలసిన అవసరాన్ని గుర్తించి తన అనుభవ తీవ్రతలోంచి, అవమానాల, ఆగ్రహావేశాల్లోంచి నోరు విప్పిందని స్పష్టం చేస్తుంది ఈ వేకువపిట్ట.   ఆధిపత్య సంస్కృతే అందరి సంస్కృతి కాదని, అందరిదీ ఓకే సంస్కృతిగా మారే భవిష్యత్తును కాంక్షిస్తూ కలగంతుంది ఈ వేకువపిట్ట. “కులం, వర్గము, ఆధిపత్యము ఈ సమాజంలో ఉన్నంతవరకూ నిరంతర పోరాటం సాగుతూనే ఉంటుంది” అంటుంది ఈ వేకువపిట్ట, ఆ పోరాటాలకు ఊపిరి పోస్తుంది ఈ వేకువపిట్ట. చూడండి ..

Virasam web magazain on 'Vekuvapitta'

Image
దళిత దృక్పధం, ధిక్కార స్వరం                                                డా. వెల్దండి శ్రీధర్ మానవ సమాజ పరిణామ వికాసంలో గత దశాబ్దం చాలా సంక్షోభాలకు , కుదుపులకు గురైన కాలం. కుల వివక్ష , పరువు హత్యలు , ఆకలి హత్యలు , హిందుత్వ హత్యలు , పెద్దకూర హత్యలు , పసిమొగ్గలపై అత్యాచారాలు , చుండూరు దళిత హత్యలపై కోర్టు తీర్పు , మైనార్టీలపై దాడులు , స్త్రీలపై పెరుగుతున్న హింస , హక్కుల కార్యకర్తలను వ్యూహాత్మకంగా చంపేయడం , భావ ప్రకటనా స్వేచ్ఛను హరించడం , సెజ్‌ల పేరుతో ఆదివాసీలను , దళితులను నిర్వాసితులను చేయడం , స్వలింగ సంపర్కంపై వెలువడిన తీర్పు , ఇష్టంతో అక్రమ సంబంధాలు ఏర్పర్చుకునే స్వేచ్ఛ , నిర్భయ ఉదంతం , ఆసిఫా సంఘటన.. ఇత్యాది అనేక సంఘటనలు దేశ మానవాళిని తీవ్రమైన షాక్‌కు గురిచేశాయి. ఈ దశలో ప్రశ్నించే మనిషిని ఎట్లా అదృశ్యం చేయాలో రాజ్యం కూడా చాలా తెలివిగా పావులు కదుపుతూ ఒక్కొక్కరిని ఏరి పారేయడం మొదలు పెట్టింది. పౌరహక్కుల నేతలు , ప్రజాస్వామ్య వాదులు , వెన్నుపూస వున్న రచయితలు , కవులు నిత్యం ఏమరుపాటుతో ఉండి అసలు మనిషి చుట్టూ ఏం జరుగుతుందో చెప్పడానికి చాలా ప్రయత్నించారు. తద్వారా అనేక ప్రజా స