Posts

Showing posts from June, 2019

Iftar - poem

Image
ఇఫ్తార్, ద లాస్ట్ సప్పర్ చల్లపల్లి స్వరూపరాణి నెత్తిన టోపీ పెట్టుకుని దేశాధినేతలంతా అతనితో కల్సి కంచంలో చెయ్యి కడిగి   గుండెకు గుండెని ఆనించి అలాయి బలాయి తీసుకున్నది నిజమైతే రోజూ దేశ మాత నుదుటిమీద   అతడే ఎందుకు   ఎర్రటి   సిందూరమౌతాడు? కుంకుమ పూలు   ఆయేషా, అసీఫాలు   నలిగి నజ్జైంది రాజకీయ రధ చక్రాల కింద కాదా?   ఇక్లాక్ అన్నం ముద్దలో మందుగుండు వడ్డించినదెవరు? ఇస్కారియోతు యోదాలు తప్ప సోదరుల మీద   ఎవరైనా నిందలు మోపుతారా? ఇఫ్తార్ విందులో టోపీ యెవరి నెత్తి మీదున్నా     నిత్యం అభద్రతా సుడిగుండంలో మునిగేది అతడే! పుట్టుకతో నేరస్తుల జాబితాలోకెక్కినవాడు ఇప్పుడతనికి మీ విందు అక్ఖర్లేదు చెమట వెచ్చించి సమకూర్చుకున్న అతని అన్నంలో అనుమానపు రాళ్ళవ్వకండి మీరు తనకి గుండె ఆనించకపోయినా పర్లేదు తనని గుండెనిండా స్వేచ్చగా గాలి పీల్చుకోనియ్యండి మీకు చేతనైతే ఈదేశం అతనిది కూడా అని మూకస్వామ్యానికి అరిచి చెప్పండి మీకు వీలయితే అతని డైరీలో   ఓ నెత్తురంటని   పేజీని బహూకరించండి 03.06.2019            * Greetings on Ramadan    

Mango assault- poem

Image
మామిడిపళ్ళ రక్తం చల్లపల్లి స్వరూపరాణి అప్పుడు కోటేసు చెంబు దొంగతనం చేస్తే సజీవ దహనం చెయ్యలేదా ? ఇప్పుడు శీను మామిడికాయ దొంగతనం చేసినందుకు ఉరిశిక్ష వేశాం స్థల కాలాలే మారింది అంతా సేం టూ సేం ఇంకా ఏ కాలంలో ఉన్నాం అని అడగొద్దు కాలం మీకెప్పుడూ ఎండాకాలమే అని తెల్సుకోండి ఇక్కడ ఏది తినాలన్నా అనుభవించాలన్నా   ప్రేమించాలన్నా విధిగా కులం కావాలి అది మీకెక్కడిది? పండ్లూ, ఫలాలూ మేమే తింటాం మీరూ మీవాళ్ళూ చెట్టుకి నీరుపోసి కావలి ఉండండి పాలూ నెయ్యీ మేమే తాగుతాం మీరు గేదెల్ని మేపి పేడ కళ్ళు ఎత్తేయండి    నాలుక్కూరలు, నవకాయ పిండి వంటలూ మేమే భుజిస్తాం మీరు పండించి గోతాలకెత్తండి మీరు ఇవేవీ ఆశించకూడదు వాటి వంక చూడకూడదు రాలిపడిన కాయకు కూడా నోచని బతుకులు మీవి మీ ప్రాణాల ఖరీదు కేరళలో పిడికెడు అన్నం కంచికచర్లలో ఒక రాగి చెంబు కాదంటే సింగంపల్లిలో రెండు రాలిపడ్డ మామిడి కాయలు ఎంగిలిస్తరాకు తప్ప మీకంటూ సొంత కంచాన్ని కలగనొద్దు సొంత గొంతుతో అసలు మాట్లాడొద్దు ఎందుకంటే మీ పరాధీనత మరింత పొడిగించబడింది మీ వీపు మా ముక్కాలు పీటయ్యిందని ప్రకట