Posts

Showing posts from May, 2019

Varadagudi- poem

Image
                                                                             వరదగుడి                                                                                                  చల్లపల్లి స్వరూపరాణి కొందరికి కంచాల్లో   మరి కొందరికి ఆకుల్లో వడ్డించే దేశమాత నోరెండిపోతున్నా   గుక్క పాలుతాపని గోమాత   చచ్చినాక బొందపెట్టుకోడానికి   ఆరడుగుల నేల కొసరని భూమాత   కొందరిని తరగతి గది బైటకి నెట్టే   చదువుల తల్లి   ఇంతమంది అమ్మల నడుమ   ఒడినిండా గొడ్డు చాకిరీ ,   గుండెల్నిండా చీత్కారాలు తప్ప ఇంకేమీ ఎరగని   నిన్నెక్కడ వెతికేది మా! బడి మానేస్తే కొట్టడం   చెడు స్నేహాలు పడితే తిట్టడం చేతకాని వెర్రిబాగుల మనిషివి నువ్వు   ఆయా పప్పూ కలిపిన గిన్నె పట్టుకుని కొసరి కొసరి గోరుముద్దలు   పెట్టలేని కటికదానివి   నువ్వు మాతల జాబితాలో   తప్పిపోయిన పిచ్చి తల్లివి   త్యాగాల పుటల్లో మాయమై నల్ల మబ్బుల్లోకెక్కిన వరదగుడివి కురవడం నేర్పిన నీకోసం నేలమీద ఎంతని వెతకను! మా బతుకంతా పరుచుకున్న   నీ చెమట చుక్కల్ని ఏరి   దండకట్టడం తప్ప! 12.05.2019

May Day- poem

Image
‘ మేడే ’ సవారీ చేస్తుంది                                                                                                                                  చల్లపల్లి స్వరూపరాణి ఇక్కడ కమ్మటి ‘ మేడే ’   ఎర్ర పూల ఏసీ చెట్టుకింద సేదదీరుతుంది   వివక్ష వడ గాలుపులో వొడలిపోయిన గుడిసె   ఇంటా బయటా దగా మంటలు   పాచీర చెంగుతో తుడుచుకుంటూ   ఉస్సురుస్సురంటుంది.... ఎల్సిపోయిన మూడు రంగుల జెండాలు ఇంకొన్ని కళా కాంతీ లేని రంగుల్ని నెత్తిమీద సిలువలా మోసుకుంటూ బతుకు గొల్గొతా కొండ ఎక్కలేక   గోడకుర్చీ వేస్తుంది   ఇక్కడ చెమట చుక్కల్ని   అసే తుసే పిలుపులతో ఏగ్యానం చేసే మేడ మాత్రం ఎరుపు రంగు వీపుమీద సవారీ చేస్తుంది   ఆఫీసు అటెండర్ల తో ఇంటి పనీ , పెంట పనీ   చేయించే దొరలు విద్యార్ధులతో తమ పెంపుడు కుక్కల   అశుద్ధం కడిగించే దొరసానులు ఇక్కడ అభ్యుదయపు   చిలక పలుకులు మా కమ్మగా పలుకుతారు   అహో! ఇది మదమెక్కిన కులవాదం కాక సామ్యవాదమెట్లా అవుతుంది   మార్క్స్ గురువర్యా! నువ్వీ ఊర్లో పుట్టుంటే   ‘ కులం పెట్టుబడి ’ అంటే ఏంటో   విడమర్సి రాసేవాడివి కదా!   బహుశా తప్పు నీది కాదు... కానివారి

Sahoo Maharaj- essay

Image
పీడిత ప్రజల్ని గెలిచిన మహారాజు సాహూ                                                                      చల్లపల్లి స్వరూపరాణి    చత్రపతి సాహూ మహరాజ్ మహాత్మా ఫూలే తర్వాత బ్రాహ్మణేతర వుద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడమే కాకుండా దళిత బహుజనులను బ్రాహ్మణాధిపత్యం నుండి విముక్తి చెయ్యడానికి అటు పాలనా పరంగానూ , ఇటు సైద్ధాంతికంగానూ కృషి చేశాడు . శివాజీ మరణించిన 200 సంవత్సరాల తర్వాత ఆ వంశానికి వారసుడిగా సాహూ మహరాజ్ కొల్హాపూర్ సంస్థానానికి రాజై పాలకవర్గ స్వభావానికి భిన్నంగా బ్రాహ్మణ వ్యతిరేక వుద్యమకారుడిలాగా అట్టడుగు కులాల అభివృద్దికి సరికొత్త నమూనా తయారు చేశాడు .  విద్య , వైద్య , వ్యవసాయ రంగాలన్నింటిలో అణగారిన వర్గాలకు అనుకూలమైన విప్లవాత్మకమైన చట్టాలను రూపొందించి వెనుకబడిన కులాల ప్రజలకు విద్య , వుద్యోగ రంగాలలో యాభై శాతం రిజర్వేషన్లను అమలు పరిచిన మొట్టమొదటి పాలకుడు సాహూ మహరాజ్ . ఆయన స్త్రీ పక్షపాతి . మహిళా సంక్షేమానికి కూడా పటిష్టమైన   చట్టాలను రూపొందించాడు . కొల్హాపూర్ సంస్థానం శివాజీ రాజ్యంలో అంతర్భాగం. రాజ్యం కోసం శివాజీ వారసుల మధ్య జరిగిన అంతరంగిక వివాదాల్లో వారు ఒక ఒప్పందానిక