Nelson Mandela
నల్ల సూర్యుడికో
నూలుపోగు
చల్లపల్లి స్వరూపరాణి
నలుపు రంగు
యెంత చక్కనిదో
నిన్ను చూశాకే కదా
ప్రపంచం తెలుసుకుంది!
తెల్లటి మృగం మొహాన
తుపుక్కున వుమ్మటానికి
నల్ల మనుషుల వొంట్లో
సత్తువ నింపిన సూర్యుడా!
యీ శకం నీదేరా తండ్రీ!
కాలం నీ బొమ్మని కూడా
రంగుల్లో చూడ్డానికి
యిష్టపడదు కదా!
రంగుల లోకాన్ని ధిక్కరించే
అవర్ణుల రక్తంలో
ప్రవహిస్తూనే వుంటావు నువ్వు
గుండెలు మండేలా!
(జులై 18, 2018 నెల్సన్ మండేలా శతజయంతి)
Comments
Post a Comment