కాలం
వొంటిపై నెత్తుటి మరక
చల్లపల్లి
స్వరూపరాణి
యెన్నిసార్లు తల్చుకున్నా
నువ్వు సలపరిస్తూనే వుంటావు
కారంచేడూ!
చరిత్ర వొంటిమీద
నువ్వో మాయని మచ్చవి!
నువ్వు సలపరిస్తూనే వుంటావు
కారంచేడూ!
చరిత్ర వొంటిమీద
నువ్వో మాయని మచ్చవి!
నువ్వు
కాలం చిమ్మిన విషపు చారికవి!
నీ జ్ఞాపకం
వో చేదు చిరక!
నేలమీద
కులం బుసబుసలు
వినిపించినంతమేర
కారంచేడూ!
నువ్వే గుండెలో గాయమై
కలుక్కుమంటావు!
వాడ కండలు కరిగించి
యినప్పెట్టెలతో పాటు
బలుపు చెరువునీ
నింపుకున్న దకాటీదానా!
యిప్పుడు
నువ్వో గ్రామ నామానివి కావు
దేశపు చిరునామావి!
కారంచేడూ! నిజం చెప్పు!
జూలై పదిహేడుని
మాదిగ పల్లెపై వుసిగొల్పిన
దొరతనం
కాలం వురికంబం మీద
పుటుక్కుమనలేదా?
17.07.2018
Comments
Post a Comment