Article on Shiek Msood Baba
ఉద్యమాన్ని శ్వాసించిన షేక్ మసూద్ బాబా చల్లపల్లి స్వరూపరాణి శ్రీకాకుళ సాయుధ పోరాట యోధుడు, ప్రజా వుద్యమాల పట్ల గొప్ప ప్రేమతో ఆశతో ప్రత్యామ్నాయ రాజకీయాలు నిర్మించడానికి తపన పడిన షేక్ మసూద్ బాబా గారు యీ నెల అయిదవ తేదీన తీవ్ర అనారోగ్యంతో విజయవాడలో మృతి చెందారు. ఆయన జీవితం గొప్ప నిజాయితీకి, నిబద్ధతకీ నిలువెత్తు ప్రతీక. ‘బాబా’ గా అందరికీ చిరపరిచితుడి గా వున్న మసూద్ బాబా గారు 1946 లో అమీనాబీ, మస్తాన్ దంపతుల మొదటి బిడ్డగా జన్మించారు. వీరి స్వస్థలం గుంటూరు జిల్లా రొంపిచర్ల. ఆయన తల్లిదండ్రులు జీననోపాధిని వెదుక్కుంటూ వచ్చి బాబా గారి చిన్నతనంలోనే విజయవాడలో స్థిరపడ్డారు. ఆయనకి నలుగురు తమ్ముళ్ళు, యిద్దరు చెల్లెళ్ళు. వారి తోబుట్టువులు, బంధువులు విజయవాడ, మచిలీపట్నం పరిసర ప్రాంతాలలోనే యెక్కువగా స్తిరపడ్డారు. అయిదో క్లాసు వరకూ చదువుకున్న ఆయన చిన్నతనం నుంచే మార్క్సిజం పట్ల అభిమానాన్ని పెంచుకున్నారు. ఆయన చిన్నతనంలో విజయవాడ సూర్యారావు పేట లోని బెల్లం శోభనాద్రి గ్రంధాలయంలో సోవియట్ పుస్తకాల్లో బొమ్మలు చూడ్డానికి వెళ్ళేవారు. ఆవిధంగా క్రమంగా ఆయన కమ్యూనిస్ట్ సాహిత్...