దళిత దృక్పధం, ధిక్కార స్వరం డా. వెల్దండి శ్రీధర్ మానవ సమాజ పరిణామ వికాసంలో గత దశాబ్దం చాలా సంక్షోభాలకు , కుదుపులకు గురైన కాలం. కుల వివక్ష , పరువు హత్యలు , ఆకలి హత్యలు , హిందుత్వ హత్యలు , పెద్దకూర హత్యలు , పసిమొగ్గలపై అత్యాచారాలు , చుండూరు దళిత హత్యలపై కోర్టు తీర్పు , మైనార్టీలపై దాడులు , స్త్రీలపై పెరుగుతున్న హింస , హక్కుల కార్యకర్తలను వ్యూహాత్మకంగా చంపేయడం , భావ ప్రకటనా స్వేచ్ఛను హరించడం , సెజ్‌ల పేరుతో ఆదివాసీలను , దళితులను నిర్వాసితులను చేయడం , స్వలింగ సంపర్కంపై వెలువడిన తీర్పు , ఇష్టంతో అక్రమ సంబంధాలు ఏర్పర్చుకునే స్వేచ్ఛ , నిర్భయ ఉదంతం , ఆసిఫా సంఘటన.. ఇత్యాది అనేక సంఘటనలు దేశ మానవాళిని తీవ్రమైన షాక్‌కు గురిచేశాయి. ఈ దశలో ప్రశ్నించే మనిషిని ఎట్లా అదృశ్యం చేయాలో రాజ్యం కూడా చాలా తెలివిగా పావులు ...