Ambedkar Statue- Poem
ఆరడుగుల గడ్డపార
__________________చల్లపల్లి స్వరూపరాణి
__________________చల్లపల్లి స్వరూపరాణి
తెగిపడిన అంగం
తినిపారేసిన బొమిక
మురికి కూపం బతుకు
అన్నీ విదుల్చుకుని
లేచి నిలబడింది ఆ బొమ్మ...
ఏదోలే! శుభ్రంగా ఒక బొమ్మ ఉంది మనకి
అనుకుంది అది నిలబడ్డ పల్లె...
గ్రామ దేవతకు మల్లె
ఏడాదికోమారు కొబ్బరికాయ కొట్టి
దండం పెట్టుకుంది...
పోనీలే! గోచిపాత వాడకి
ఓ బులుగు ప్యాంటు బొమ్మ
అనుకుంది వూరు...
బొమ్మచుట్టూ చేరి
గోలీలు ఆడుకునే చినిగిన నిక్కర్లు
బొమ్మ చేతి పుస్తకం అందుకున్నాయి...
చీమిడి ముక్కు లాగులు
ఇస్త్రీ చేసిన ప్యాంటూ, షర్టు అయ్యాయి
అచ్చం బొమ్మలాగే...
ముసిముసిగా నవ్వుకుంది బొమ్మ
క్రాఫ్ సవరించుకుంటూ...
జరీ కట్టు పంచెల్ని చూసి
ధబీమని లేచి నుంచునే
కుక్కి మంచాలు
బొమ్మని చూసి
నిటారుగా నిలబడడం నేర్చుకున్నాయి...
ఈ మిడిమేలం ఆ బొమ్మ వచ్చినాకే
గొణుక్కున్నాయి వూరి అరుగులు...
ఎప్పటినుంచో
నాలుగేళ్ళ మొండి చేతితో నెట్టుకొస్తున్న
పూరి గుడిసెలకి ఉన్నట్టుండి
బొట్టేళ్ళు మొలుచుకొచ్చాయి...
ఈసారి బొమ్మ బిగ్గరగానే నవ్వింది
మెడలో టై సరిచేసుకుంటూ...
వీపున ఎవరో గట్టిగా చరిచినట్టు
ఉలిక్కిపడింది వూరు
బొమ్మని తేరిపార చూసింది
తాటాకు గుడిసెల ముందు
దిగాలుగా నుంచునే బొమ్మ
మిల మిల మెరిసింది...
డాబాలకు కంటిమీద కునుకు లేదు
మర్నాడు చీకట్లో
చేతి కర్రలన్నీ గునపాలయ్యాయి...
వుట్టి మీద జాడీలో కారం
వాడ కొంగులో....
బొమ్మంటే యుద్ధం...
బొమ్మంటే గుండెల్ని మండించే అగ్ని...
బొమ్మంటే వెంటాడే దావానలం...
బక్క మనిషిని సాయుధం చేసే
ఓ ఆలోచన...
బొమ్మంటే ఒక నిరంతర సంభాషణ
ఉలుకూ పలుకూ లేని విగ్రహమాత్రుల్ని
హృదయం లేని రాతి శిలల్ని కూల్చే
ఆరడుగుల గడ్డపార...
తినిపారేసిన బొమిక
మురికి కూపం బతుకు
అన్నీ విదుల్చుకుని
లేచి నిలబడింది ఆ బొమ్మ...
ఏదోలే! శుభ్రంగా ఒక బొమ్మ ఉంది మనకి
అనుకుంది అది నిలబడ్డ పల్లె...
గ్రామ దేవతకు మల్లె
ఏడాదికోమారు కొబ్బరికాయ కొట్టి
దండం పెట్టుకుంది...
పోనీలే! గోచిపాత వాడకి
ఓ బులుగు ప్యాంటు బొమ్మ
అనుకుంది వూరు...
బొమ్మచుట్టూ చేరి
గోలీలు ఆడుకునే చినిగిన నిక్కర్లు
బొమ్మ చేతి పుస్తకం అందుకున్నాయి...
చీమిడి ముక్కు లాగులు
ఇస్త్రీ చేసిన ప్యాంటూ, షర్టు అయ్యాయి
అచ్చం బొమ్మలాగే...
ముసిముసిగా నవ్వుకుంది బొమ్మ
క్రాఫ్ సవరించుకుంటూ...
జరీ కట్టు పంచెల్ని చూసి
ధబీమని లేచి నుంచునే
కుక్కి మంచాలు
బొమ్మని చూసి
నిటారుగా నిలబడడం నేర్చుకున్నాయి...
ఈ మిడిమేలం ఆ బొమ్మ వచ్చినాకే
గొణుక్కున్నాయి వూరి అరుగులు...
ఎప్పటినుంచో
నాలుగేళ్ళ మొండి చేతితో నెట్టుకొస్తున్న
పూరి గుడిసెలకి ఉన్నట్టుండి
బొట్టేళ్ళు మొలుచుకొచ్చాయి...
ఈసారి బొమ్మ బిగ్గరగానే నవ్వింది
మెడలో టై సరిచేసుకుంటూ...
వీపున ఎవరో గట్టిగా చరిచినట్టు
ఉలిక్కిపడింది వూరు
బొమ్మని తేరిపార చూసింది
తాటాకు గుడిసెల ముందు
దిగాలుగా నుంచునే బొమ్మ
మిల మిల మెరిసింది...
డాబాలకు కంటిమీద కునుకు లేదు
మర్నాడు చీకట్లో
చేతి కర్రలన్నీ గునపాలయ్యాయి...
వుట్టి మీద జాడీలో కారం
వాడ కొంగులో....
బొమ్మంటే యుద్ధం...
బొమ్మంటే గుండెల్ని మండించే అగ్ని...
బొమ్మంటే వెంటాడే దావానలం...
బక్క మనిషిని సాయుధం చేసే
ఓ ఆలోచన...
బొమ్మంటే ఒక నిరంతర సంభాషణ
ఉలుకూ పలుకూ లేని విగ్రహమాత్రుల్ని
హృదయం లేని రాతి శిలల్ని కూల్చే
ఆరడుగుల గడ్డపార...
17.04.2019
Comments
Post a Comment