Toonikalu-Poem
తూనికలు-కొలతలు
________________చల్లపల్లి స్వరూపరాణి
________________చల్లపల్లి స్వరూపరాణి
మనుషులు కురచౌతారు
ఆజానుబాహులు
గిడసబారిపోతారు
ఏ తర్కానికీ అందని
గతిలేని లోకమిది...
మనిషి కోసం పరితపించి
జీవితాన్ని పోగొట్టుకున్నవాడి నవ్వును
లిట్మస్ టెస్ట్ కి పంపుతారు...
చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా
మెరిసే కంటి కాంతిని
స్కేలుతో కొలుస్తారు...
కుళ్ళబొడిచినా
పైకెత్తిన తలని
తూకం వేస్తారు
చచ్చిపోయినవాడి కళ్ళల్లో
వేలుపెట్టి చూస్తారు...
గట్టి గట్టి నినాదాలు ఇచ్చే నాలుకలు
ఒదులౌతాయి...
భిన్నాభిప్ర్రాయం పీక నొక్కి
ఐక్యత సన్నాయి రాగమందుకుంటారు...
మేటలు వేసిన కీర్తి మీద
పీటేసుకుని కూర్చుందామనుకుంటారు...
ప్రవాహాన్ని ఆపి
తమ గుంజకి కట్టేసుకుందామనుకుంటారు...
కట్లు తెంపుకు పోతున్న
మందని చూసి
అసహనంతో అబ్బిళ్ళు కొరుకుతారు...
ఆరడుగుల చాతీ
అంగుళానికి కుదించుకుపోతుంది...
పువ్వులు వికసిస్తాయని
ఆలోచనలు ఒరుసుకుంటూ
ముందుకే నడుస్తాయని
వాళ్లకి ఎవరు చెబుతారు?
ఆజానుబాహులు
గిడసబారిపోతారు
ఏ తర్కానికీ అందని
గతిలేని లోకమిది...
మనిషి కోసం పరితపించి
జీవితాన్ని పోగొట్టుకున్నవాడి నవ్వును
లిట్మస్ టెస్ట్ కి పంపుతారు...
చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా
మెరిసే కంటి కాంతిని
స్కేలుతో కొలుస్తారు...
కుళ్ళబొడిచినా
పైకెత్తిన తలని
తూకం వేస్తారు
చచ్చిపోయినవాడి కళ్ళల్లో
వేలుపెట్టి చూస్తారు...
గట్టి గట్టి నినాదాలు ఇచ్చే నాలుకలు
ఒదులౌతాయి...
భిన్నాభిప్ర్రాయం పీక నొక్కి
ఐక్యత సన్నాయి రాగమందుకుంటారు...
మేటలు వేసిన కీర్తి మీద
పీటేసుకుని కూర్చుందామనుకుంటారు...
ప్రవాహాన్ని ఆపి
తమ గుంజకి కట్టేసుకుందామనుకుంటారు...
కట్లు తెంపుకు పోతున్న
మందని చూసి
అసహనంతో అబ్బిళ్ళు కొరుకుతారు...
ఆరడుగుల చాతీ
అంగుళానికి కుదించుకుపోతుంది...
పువ్వులు వికసిస్తాయని
ఆలోచనలు ఒరుసుకుంటూ
ముందుకే నడుస్తాయని
వాళ్లకి ఎవరు చెబుతారు?
18.04.2019
Comments
Post a Comment