Varadagudi- poem



                                                                             వరదగుడి
                                                                                                చల్లపల్లి స్వరూపరాణి
కొందరికి కంచాల్లో
 
మరి కొందరికి ఆకుల్లో
వడ్డించే దేశమాత
నోరెండిపోతున్నా
 
గుక్క పాలుతాపని గోమాత
 
చచ్చినాక బొందపెట్టుకోడానికి
 
ఆరడుగుల నేల కొసరని భూమాత
 
కొందరిని తరగతి గది బైటకి నెట్టే
 
చదువుల తల్లి
 
ఇంతమంది అమ్మల నడుమ
 
ఒడినిండా గొడ్డు చాకిరీ,
 
గుండెల్నిండా చీత్కారాలు తప్ప
ఇంకేమీ ఎరగని
 
నిన్నెక్కడ వెతికేది మా!
బడి మానేస్తే కొట్టడం
 
చెడు స్నేహాలు పడితే తిట్టడం చేతకాని
వెర్రిబాగుల మనిషివి నువ్వు
 
ఆయా పప్పూ కలిపిన గిన్నె పట్టుకుని
కొసరి కొసరి గోరుముద్దలు
 
పెట్టలేని కటికదానివి
 
నువ్వు మాతల జాబితాలో
 
తప్పిపోయిన పిచ్చి తల్లివి
 
త్యాగాల పుటల్లో మాయమై
నల్ల మబ్బుల్లోకెక్కిన
వరదగుడివి
కురవడం నేర్పిన నీకోసం
నేలమీద ఎంతని వెతకను!
మా బతుకంతా పరుచుకున్న
 
నీ చెమట చుక్కల్ని ఏరి
 
దండకట్టడం తప్ప!
12.05.2019


Comments

Popular posts from this blog

Charvaka Asram- Write up

Nomadic Tribe- Chenchu

Dalit Women's Writing-EPW