Krisha river-Poem
కృష్ణా నది
చల్లపల్లి స్వరూపరాణి
చల్లపల్లి స్వరూపరాణి
ఒరే, కృష్ణా!
నువ్ వేదంలా ఘోషించకపోయినా
సూత రుక్కువై
మా చెవుల తుప్పు వదిలించావు
పైన చూపులకి నలుపైనా
నీ నిలువెల్లా బలుపే
కృష్ణా, నువ్వు నెత్తురై వురికావు తప్ప
అసలు నీరై ఎప్పుడు ప్రవహించావు?
ఓడ్చే చెమట కుండ వెలివాడ
నీ నల్ల రేగడి చాళ్ళని తడిపి
నిన్ను ధాన్యాగారాన్ని చెయ్యలేదా?
వానాకాలం నీ లోతట్టు ప్రాంతమంతా
గుడిసెల కన్నీటిమయం కదా!
కృష్ణా, నిజం చెప్పు!
ఎన్ని మిస్సింగ్ శవాలను
మింగి తేన్చావో
వాడు గడ్డిలో కుక్కి కాలవలో పాతిన
పాలేరు దట్టాలు
లాకుల దగ్గర ఆగి గడ్డిపోచకోసం
రాత్రంతా మేల్కొనేవి
ఇక్కడి భూములేలు దొరల క్రౌర్యం
కిష్ట కాలవలో వెల్లువెత్తుతుంది
ఆలీసమ్మ నెత్తురుతో
మద్రాసు కాల్వ
బరీగా తొణికిసలాడుతుంది చూడు!
నీ గట్టుమీద మొలిచిన
తధాగతుడ్ని తరిగిపోసి
రేవుకో గుడికట్టిన కధకి
నువ్వేకదా సాక్షివి!
నిజం చెప్పు,
మేటలేసిన కర్ర పెత్తనం
కూలోడిని పిండుకు తాగి
నడమంత్రపు సిరి తట్టలకెత్తుకోడం
నీకు తెల్సు కదా!
కృష్ణా,
నువ్వు బ్రాహ్మణీకానికి ఎదురెళ్ళి
సూత జంధ్యపు పోగుగా మిగిలిపోయినవాడివి!
ఏట్లో చేపలు పట్టుకునే గుడిసెల్ని గెంటేసి
కొవ్వు కరిగించే ఆశ్రమాలు కట్టిస్తావు
యిసుక తోడేళ్ళ డబ్బు సంచులు నింపుతావు
కృష్ణా, నువ్వో కారంచేడువి, చుండూరువి
రొండున్నర జిల్లాల భాషని
అందరి నెత్తిన రుద్దిన
సాంస్కృతిక పెత్తనానివి!
'కృష్ణ వేణి అంటే 'నల్లటి జడ' అంట
కానీ నీ పరీవాహమంతా
పులి చంపిన లేళ్ళ రక్తపు చారలు తప్ప
జడలల్లుకునే ఆడపిల్లల జాడ లేదు
ఆడ పసి గుడ్డుని
తల్ల్లి కడుపులోనే చిద్రం చేసే
కత్తుల కార్ఖానావి
అందుకే, నువ్ నాకు మస్కులర్ జెండర్
కృష్ణా, నీది ‘నల్ల దొరతనం’
నువ్వొక పాపాల భైరవుడివి
ఒక ప్రవాహంలా కాక
అంటుజాడ్యానికి ఆనవాళ్లైన
ఊరి చెరువులాగో బావిలాగో
అగుపిస్తావు
పారే ఏరువి కదా చేరదీరదామంటే
నీ పొట్టలో దాగిన
తరతరాల జల సమాధులు
చెవిలో గూడుకట్టుకుని హోరుమంటున్నాయి
నువ్ వేదంలా ఘోషించకపోయినా
సూత రుక్కువై
మా చెవుల తుప్పు వదిలించావు
పైన చూపులకి నలుపైనా
నీ నిలువెల్లా బలుపే
కృష్ణా, నువ్వు నెత్తురై వురికావు తప్ప
అసలు నీరై ఎప్పుడు ప్రవహించావు?
ఓడ్చే చెమట కుండ వెలివాడ
నీ నల్ల రేగడి చాళ్ళని తడిపి
నిన్ను ధాన్యాగారాన్ని చెయ్యలేదా?
వానాకాలం నీ లోతట్టు ప్రాంతమంతా
గుడిసెల కన్నీటిమయం కదా!
కృష్ణా, నిజం చెప్పు!
ఎన్ని మిస్సింగ్ శవాలను
మింగి తేన్చావో
వాడు గడ్డిలో కుక్కి కాలవలో పాతిన
పాలేరు దట్టాలు
లాకుల దగ్గర ఆగి గడ్డిపోచకోసం
రాత్రంతా మేల్కొనేవి
ఇక్కడి భూములేలు దొరల క్రౌర్యం
కిష్ట కాలవలో వెల్లువెత్తుతుంది
ఆలీసమ్మ నెత్తురుతో
మద్రాసు కాల్వ
బరీగా తొణికిసలాడుతుంది చూడు!
నీ గట్టుమీద మొలిచిన
తధాగతుడ్ని తరిగిపోసి
రేవుకో గుడికట్టిన కధకి
నువ్వేకదా సాక్షివి!
నిజం చెప్పు,
మేటలేసిన కర్ర పెత్తనం
కూలోడిని పిండుకు తాగి
నడమంత్రపు సిరి తట్టలకెత్తుకోడం
నీకు తెల్సు కదా!
కృష్ణా,
నువ్వు బ్రాహ్మణీకానికి ఎదురెళ్ళి
సూత జంధ్యపు పోగుగా మిగిలిపోయినవాడివి!
ఏట్లో చేపలు పట్టుకునే గుడిసెల్ని గెంటేసి
కొవ్వు కరిగించే ఆశ్రమాలు కట్టిస్తావు
యిసుక తోడేళ్ళ డబ్బు సంచులు నింపుతావు
కృష్ణా, నువ్వో కారంచేడువి, చుండూరువి
రొండున్నర జిల్లాల భాషని
అందరి నెత్తిన రుద్దిన
సాంస్కృతిక పెత్తనానివి!
'కృష్ణ వేణి అంటే 'నల్లటి జడ' అంట
కానీ నీ పరీవాహమంతా
పులి చంపిన లేళ్ళ రక్తపు చారలు తప్ప
జడలల్లుకునే ఆడపిల్లల జాడ లేదు
ఆడ పసి గుడ్డుని
తల్ల్లి కడుపులోనే చిద్రం చేసే
కత్తుల కార్ఖానావి
అందుకే, నువ్ నాకు మస్కులర్ జెండర్
కృష్ణా, నీది ‘నల్ల దొరతనం’
నువ్వొక పాపాల భైరవుడివి
ఒక ప్రవాహంలా కాక
అంటుజాడ్యానికి ఆనవాళ్లైన
ఊరి చెరువులాగో బావిలాగో
అగుపిస్తావు
పారే ఏరువి కదా చేరదీరదామంటే
నీ పొట్టలో దాగిన
తరతరాల జల సమాధులు
చెవిలో గూడుకట్టుకుని హోరుమంటున్నాయి
28.06.2019
* గోదావరి, 'హిందూ మహా సముద్రం' కవులు
మద్దూరి నగేష్ బాబు, పైడి తెరేష్ బాబుల కోసం
Comments
Post a Comment