CAB/NRC- poem














తాటక దండకం
                                                                                      చల్లపల్లి స్వరూపరాణి

దేశమంటే మట్టీ మశానాలూ
మల మూత్రాలూ,
గుడి గోపురాలూ కాదురా!
కష్ట జీవుల్ది ఈదేశం...
దేవుడి పేరు చెప్పి
మనుషుల్ని దెయ్యంలా పీడించే
సైతాన్, అసలు నువ్వేరా,
ఈదేశానికి పట్టిన చీడ పుగుగువి !
ఒరే,
నువ్వు కడుపుకి అన్నం తింటున్నావా!
తిండి పేరు చెప్పి
నరమాంసం బొక్కుతున్నావ్!
పరిశుద్ధం, స్వచ్చం అంటా
దేశాన్ని గంగానదిని చేసేవ్ కదరా!
నీ దేశభక్తి సంబడం
చెవలకి బో ఇంపుగా ఉందిలేగానీ
నీ మనుషుల్లో ఒక్కడంటే ఒక్కడు
మిలిట్రీకెల్లిన మొగోడున్నాడా చెప్పు !
అందరి మాయ ముంతలూ అడిగే
మొనగోడు సిమింటువి
ఏదీ, నీ అజాంబ్రం చూపియ్!
ఎక్కడోడివి... యాడోడివిరావిరా!
అసలు నువ్వు
ఏవూరికన్నా గడ్డెత్తినోడివేనా?
ఆడి కన్ను మన్నైపోను!
ఏదేవుడు చెప్పేడురా నీకు
ఈనేలని నెత్తురులో ముంచమనీ!
నీకు దూం తగల...
నీకు అచ్చరం విలువేందో తెలుసా!
చదువుకునే పిల్లోళ్ళ మీదపడి
ఏడిసి చస్తన్నావ్ ముదనష్టపోడా!
నీకు గత్తరొచ్చిపోను!
ఎన్నడన్నా నువ్ పుస్తకాల మొకం చూస్తే
గ్రంధాలయం తగలబెట్టవురా
తలకి మాసిన సన్నాసీ!
మా ఉసురు తగులుద్ది సూడు నీకు
ఆడపిల్లలని ఆగం చేసే
నీ ఇత్తనం ఇలమీద లేకుండా పోద్ది!
నీ ఇంట్లో ఇరవయ్యొక్క పీనుగెల్ల...
మల్లీ చెబుతున్నా యిను,
ఈ ఇలాకాలో ఎవురినన్నా
ఇంకోసారి ‘దేశద్రోహి’ అన్నావంటే
ముచ్చిలిగుంటలో తంతా!
18.12.2019

Comments

Popular posts from this blog

Charvaka Asram- Write up

Nomadic Tribe- Chenchu

Dalit Women's Writing-EPW