తానే ఒక వేకువ పిట్టయి గంటేడ గౌరు నాయుడు అమ్మ చీర కొంగు నుంచి ప్రపంచాన్ని చూసి కవిత్వం చెప్పడమంటే గుండె ఘోషను ఆవిష్కరించడమేనని, ఆత్మగౌరవ పరిరక్షణ, ఆత్మగౌరవ ప్రకటన అని, జీవితమే కవిత్వానికి ముడిసరుకుగా స్వీకరించి తనదైన అను భూతిని అక్షరీకరించి తన అక్షరాల్ని మన కళ్ళలో ఎర్రజీరలుగా, అశృధారలుగా మార్చగలిగే సక్తివంతురాలైన కవిగా సాక్షాత్కరిస్తుంది చల్లపల్లి స్వరూపరాణి. దళిత ఉద్యమం కుల, వర్గ అణచివేత గురించి మాట్లాడిందని, దళిత పురుషుల కోణం నుంచి ఎక్కువగా మాట్లాడిందని, స్త్రీవాద ఉద్యమం మధ్య తరగతి అగ్రకుల మహిళల గురించే మాట్లాడిందని అనుకుంటే పీడితులలోకెల్లాపీడితులైన దళిత మహిళా తన గురించి తానూ మాట్లాడవలసిన అవసరాన్ని గుర్తించి తన అనుభవ తీవ్రతలోంచి, అవమానాల, ఆగ్రహావేశాల్లోంచి నోరు విప్పిందని స్పష్టం చేస్తుంది ఈ వేకువపిట్ట. ఆధిపత్య సంస్కృతే అందరి సంస్కృతి కాదని, అందరిదీ ఓకే సంస్కృతిగా మారే భవిష్యత్తును కాంక్షిస్తూ కలగంతుంది ఈ వేకువపిట్ట. “కులం, వర్గము, ఆధిపత్యము ఈ సమాజంలో ఉన్నంతవరకూ నిరంతర పోరాటం సాగుతూనే ఉంటుంది” అంటుంది ఈ వేకువపిట్ట, ఆ పోరాటాలకు ఊపిరి పోస్తుంది ఈ వేకువపిట్ట. ...
Comments
Post a Comment