రాచ పుండు ‘థియోగమీ’ చల్లపల్లి స్వరూపరాణి ఇక్కడంతా దేవుడి పేరు మీదే జరుగుతుంది. కవి పైడి తెరేష్ బాబు అన్నట్టు దేవుడు అసమానతల్ని సృష్టించి కొందరి ఆత్మగౌరవాన్ని ధ్వంసం చేస్తాడు. ఈదేశంలో కనీసపు మనిషి హోదా పొందని నికృష్ట జీవి అయిన జోగినీని సృష్టించినదీ ఆ దేవుడే! ఆమధ్య తెలంగాణలో ‘మొగుడనేవాడు మనిషైతే అతడు చనిపోయినప్పుడు నేను వితంతు పెన్షన్ కి అర్హత పొందుతాను, కానీ నా మొగుడు దేవుడైపాయే ఆడెప్పుడు సచ్చేది, పెన్షన్ ఎప్పుడోచ్చేది? అని ఒక జోగినీ అడిగిన ప్రశ్నకి అంతరిక్షంలోకి దూసుకెళ్తున్న నాగరిక సమాజం సమాధానం చెప్పలేదు... ఆమెని సృష్టించిన ఆ మాయదారి దేవుడు బదులు పలకలేడు... ఒకపక్క ప్రభుత్వాధినేతలే పోతురాజుల్ని, జోగినీలను ప్రోత్సహిస్తూ నగరం నడిబొడ్డున జాతర చేస్తూ, ‘రంగం’ చెప్పించుకుంటుంటే జోగినీల ప్రశ...
చౌరస్తాలో చెంచు జాతి చల్లపల్లి స్వరూపరాణి అడవిలో మానుల్లో వొకానొక మానులాగా అప్పుడే మోవులు తొడిగిన లేత పచ్చ ఆకులాగా స్వచ్చంగా పెద్దగా మాట్లాడకుండా యితరుల్ని చూస్తే మొహమాటంగా , బిడియంగా కనిపించే రాతియుగపు మనిషికి నికార్సైన ప్రతినిధి చెంచు . చెంచులు ఆదిమ మానవ తెగలలో ద్రావిడ జాతికి చెందిన వొకానొక ఆటవిక తెగకి చెందిన వారు . ' చెట్టు ’, ' చుంచు ’ వంటి పదాల నుంచి ' చెంచు ’ అనే పదం వొచ్చిందని పరిశోధకులు అంటారు . తెలుగు రాష్ట్రాలలో గుర్తించబడిన 33 గిరిజన తెగలలో చెంచులు మిగతా వారందరికంటే మరింత మూలకి నెట్టబడిన వీరు యెక్కువగ కర్నూలు , ప్రకాశం , ప్రస్తుత తెలంగాణా రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లాలలో విస్తరించిన నల్లమల అడవులలోనూ కృష్ణా , గుంటూరు , కడప మొదలైన జిల్లాలలోని మైదాన ప్రాంతాలలో అరుదుగా నివసిస్తుంటారు . చెంచులు ప్రధానంగా ఆటవిక జాతి వారే ! పాల్కురికి సోమనాధుడు రాసిన ' పండితారాధ్య చరిత్ర ’ లో ఆయన చెంచుల గురించి పేర్కొన్నాడు . నల్లమల అడవిలో వున్న ప్రముఖ శైవ క్ష...
Comments
Post a Comment