సందేశాత్మక వేకువ పిట్ట! అరణ్యకృష్ణ ఇంతటి సామాజిక దుఃఖాన్ని , ఆక్రోశాన్ని నింపుకున్న కవిత్వాన్ని ఈ మధ్య కాలంలో చదవలేదు. ఇందులో ఉన్నది సానుభూతి కాదు , సహానుభూతీ కాదు. ఉన్నదల్లా గుండెపగుళ్ళ అనుభవానికి అక్షర రూపమివ్వటమే. కులానికి-వివక్షకీ , కులానికి-ఆర్ధిక దారిద్ర్యానికి వున్న అవినాభావ సంబంధాన్ని కవి తన కవిత్వంతోకి తీసుకొచ్చిన తీరు గొప్పది. ఊరుకీ-వాడకీ మధ్యనున్న వైరుధ్యంతో కూడిన స్వానుభవాలే కవిత్వాంశాలు ఈ కవికి. ఇది చల్లపల్లి స్వరూపరాణి కవితల సంపుటి "వేకువ పిట్ట". **** మనం తరగతి గదుల్లో చరిత్ర అంటే ఏం చదువుకున్నాం ? మొత్తం భరతజాతి ఒకటిగా వున్నట్లు , ఎవరో విదేశీయులు సిల్క్ రూట్లో గుర్రాలేసుకొచ్చి , లేదా సముద్రం మీద భారీ ఓడలేసుకొచ్చి ఈ దేశాన్ని దోచుకున్నట్లు మాత్రమే చదువుతాం. కానీ ఇదే గడ్డ మీద రకరకాల సమూహాలున్నాయని , అందులో కొన్ని సమూహాలు కొన్ని వేల సంవత్సరాల తరబడి పుట్టుకని బట్టి ప్రయోజనాన్ని పొంది మరికొన్ని సమూహాల్ని అదే పుట్టుక కారణంతో దోచుకున్నాయని , హింసించాయని , ఆ దోచుకునే కారణానికి , వివక్షక...
Comments
Post a Comment