చౌరస్తాలో చెంచు జాతి చల్లపల్లి స్వరూపరాణి అడవిలో మానుల్లో వొకానొక మానులాగా అప్పుడే మోవులు తొడిగిన లేత పచ్చ ఆకులాగా స్వచ్చంగా పెద్దగా మాట్లాడకుండా యితరుల్ని చూస్తే మొహమాటంగా , బిడియంగా కనిపించే రాతియుగపు మనిషికి నికార్సైన ప్రతినిధి చెంచు . చెంచులు ఆదిమ మానవ తెగలలో ద్రావిడ జాతికి చెందిన వొకానొక ఆటవిక తెగకి చెందిన వారు . ' చెట్టు ’, ' చుంచు ’ వంటి పదాల నుంచి ' చెంచు ’ అనే పదం వొచ్చిందని పరిశోధకులు అంటారు . తెలుగు రాష్ట్రాలలో గుర్తించబడిన 33 గిరిజన తెగలలో చెంచులు మిగతా వారందరికంటే మరింత మూలకి నెట్టబడిన వీరు యెక్కువగ కర్నూలు , ప్రకాశం , ప్రస్తుత తెలంగాణా రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లాలలో విస్తరించిన నల్లమల అడవులలోనూ కృష్ణా , గుంటూరు , కడప మొదలైన జిల్లాలలోని మైదాన ప్రాంతాలలో అరుదుగా నివసిస్తుంటారు . చెంచులు ప్రధానంగా ఆటవిక జాతి వారే ! పాల్కురికి సోమనాధుడు రాసిన ' పండితారాధ్య చరిత్ర ’ లో ఆయన చెంచుల గురించి పేర్కొన్నాడు . నల్లమల అడవిలో వున్న ప్రముఖ శైవ క్ష...
నల్ల సూర్యుడికో నూలుపోగు చల్లపల్లి స్వరూపరాణి నలుపు రంగు యెంత చక్కనిదో నిన్ను చూశాకే కదా ప్రపంచం తెలుసుకుంది! తెల్లటి మృగం మొహాన తుపుక్కున వుమ్మటానికి నల్ల మనుషుల వొంట్లో సత్తువ నింపిన సూర్యుడా! యీ శకం నీదేరా తండ్రీ! కాలం నీ బొమ్మని కూడా రంగుల్లో చూడ్డానికి యిష్టపడదు కదా! రంగుల లోకాన్ని ధిక్కరించే అవర్ణుల రక్తంలో ప్రవహిస్తూనే వుంటావు నువ్వు గుండెలు మండేలా! (జులై 18, 2018 నెల్సన్ మండేలా శతజయంతి)
Comments
Post a Comment