ప్రత్యామ్నాయ సాంస్కృతిక విప్లవ క్షేత్రం - మహాత్మా రావణ మైదానం చల్లపల్లి స్వరూపరాణి ‘భారత దేశంలో జరిగినదంతా దేవుడి పేరు మీదే జరిగింది. వారి సమస్య పేరు ‘దేవుడు’ అని వివాదాస్పద రచయితగా పేరొందిన సల్మాన్ రష్డీ గుజరాత్ లో 2002 మత ఘర్షణల సందర్భంగా ‘The Guardian’ అనే పత్రికలో పేర్కొన్నాడు. అలాగే కవి పైడి తెరేష్ బాబు కూడా ఇలాగే అంటాడు ‘దేవుడు సృష్టికర్త... బానిసత్వాన్ని సృష్టించి ఆత్మగౌరవాన్ని ధ్వంసం చేస్తాడు’. నిజమే! ఇక్కడంతా దేవుడి పేరునే జరుగుతుంది. నిచ్చెనమెట్ల కుల వ్యవస్థని నేనే సృష్టించానని చెప్పుకునే దేవుళ్లున్న మతం రాజ్యమేలే దేశంలో అసమానతకు ప్రాతిపదికగా ఉండే బ్రాహ్మణీయ హిందూ మతానికి అనధికార ఆమోద ముద్ర వుంటుంది. మతం భారత సమాజాన్ని పట్టి పీడిస్తున్న అతి ముఖ్యమైన రుగ్మత అని ప్రాచీనకాలంలోనే చార్వాక, లోకాయతులు గుర్తించారు. వివిధ అంశాల మధ్య కార్యాకారణ సంబంధాలని పరిశీలించే హేతువాద దృష్టిని ఎదగనీయకుండా మనిషి కళ్ళు మూసే దైవ భావన పైన, దాని తాత్వికత పైన వారు ప్రశ్నల తూటాలు సంధించారు. ప్రాచీనకాలంలో భౌతికవాదాన్ని ప్రచారం చేసిన త...
చౌరస్తాలో చెంచు జాతి చల్లపల్లి స్వరూపరాణి అడవిలో మానుల్లో వొకానొక మానులాగా అప్పుడే మోవులు తొడిగిన లేత పచ్చ ఆకులాగా స్వచ్చంగా పెద్దగా మాట్లాడకుండా యితరుల్ని చూస్తే మొహమాటంగా , బిడియంగా కనిపించే రాతియుగపు మనిషికి నికార్సైన ప్రతినిధి చెంచు . చెంచులు ఆదిమ మానవ తెగలలో ద్రావిడ జాతికి చెందిన వొకానొక ఆటవిక తెగకి చెందిన వారు . ' చెట్టు ’, ' చుంచు ’ వంటి పదాల నుంచి ' చెంచు ’ అనే పదం వొచ్చిందని పరిశోధకులు అంటారు . తెలుగు రాష్ట్రాలలో గుర్తించబడిన 33 గిరిజన తెగలలో చెంచులు మిగతా వారందరికంటే మరింత మూలకి నెట్టబడిన వీరు యెక్కువగ కర్నూలు , ప్రకాశం , ప్రస్తుత తెలంగాణా రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లాలలో విస్తరించిన నల్లమల అడవులలోనూ కృష్ణా , గుంటూరు , కడప మొదలైన జిల్లాలలోని మైదాన ప్రాంతాలలో అరుదుగా నివసిస్తుంటారు . చెంచులు ప్రధానంగా ఆటవిక జాతి వారే ! పాల్కురికి సోమనాధుడు రాసిన ' పండితారాధ్య చరిత్ర ’ లో ఆయన చెంచుల గురించి పేర్కొన్నాడు . నల్లమల అడవిలో వున్న ప్రముఖ శైవ క్ష...
ప్రవహించే కల చల్లపల్లి స్వరూపరాణి ఒక తెల్లటి బూటుకాలు తరాలనుంచి మెడ నరాలమీద అదిమివుంచినా ఆకాశమంత స్వేచ్ఛగా గాలిపీల్చుకోవాలని నా శతాబ్దాల కల ఈ ఉచ్చిష్టపు రొదలో కదులుతూనే వుంది. వూపిరాడనితనంలో ఆహ్లాదాన్ని కలగనడం నాకిష్టమైన దినచర్య... ఆరంగుకే మచ్చ తెచ్చిన తెల్ల తోలూ! మనిషి నెత్తురు మరిగిన తెల్ల పులివి కదా! గొంతు నులమడం కలల్ని చిద్రం చెయ్యడం తప్ప నీకేం తెల్సు! నువ్వు అందరిముందూ జబ్బలు చరుచుకునే ప్రగతి అంతా నా చెమట కష్టంతో పోగు చేసింది కాదా చెప్పు! అయినా, ఇంకా గుక్కెడు మనిషితనం కోసం నాజాతి గసపెడుతూనే వుంది. నెత్తుటి మడుగుమీద నిలబడి శాంతి గీతమాలపించే నాటకాలమారి తెల్ల పావురమా! అన్ని రంగుల్నీ నీలో ఇముడ్చుకున్నావని ఎవరన్నారు? సమస్త రంగుల చేపల్నీ దిగమింగి బ్రేవుమని తేన్చిన తిమింగలం నీపేరు తెలుపంటే ఓ లాఠీ కర్రని నలుపంటే మట్టిచేతుల కష్టం అనీ నిన్నూ నన్నూ చూసిన ప్రపంచం అర్ధం చేసుకుంది. నీ నంగిరి పింగిరితన...
Comments
Post a Comment