Posts

Charvaka Asram- Write up

Image
ప్రత్యామ్నాయ సాంస్కృతిక విప్లవ క్షేత్రం - మహాత్మా రావణ మైదానం   చల్లపల్లి స్వరూపరాణి ‘భారత దేశంలో జరిగినదంతా దేవుడి పేరు మీదే జరిగింది. వారి సమస్య పేరు ‘దేవుడు’ అని   వివాదాస్పద రచయితగా పేరొందిన సల్మాన్ రష్డీ గుజరాత్ లో 2002 మత ఘర్షణల సందర్భంగా ‘The Guardian’ అనే పత్రికలో పేర్కొన్నాడు. అలాగే కవి పైడి తెరేష్ బాబు కూడా ఇలాగే అంటాడు ‘దేవుడు సృష్టికర్త... బానిసత్వాన్ని సృష్టించి ఆత్మగౌరవాన్ని ధ్వంసం చేస్తాడు’.   నిజమే! ఇక్కడంతా దేవుడి పేరునే జరుగుతుంది. నిచ్చెనమెట్ల కుల వ్యవస్థని నేనే సృష్టించానని చెప్పుకునే దేవుళ్లున్న మతం రాజ్యమేలే దేశంలో అసమానతకు ప్రాతిపదికగా ఉండే బ్రాహ్మణీయ హిందూ మతానికి అనధికార ఆమోద ముద్ర వుంటుంది. మతం భారత సమాజాన్ని పట్టి పీడిస్తున్న   అతి ముఖ్యమైన రుగ్మత అని ప్రాచీనకాలంలోనే చార్వాక, లోకాయతులు గుర్తించారు. వివిధ అంశాల మధ్య కార్యాకారణ సంబంధాలని పరిశీలించే   హేతువాద దృష్టిని ఎదగనీయకుండా   మనిషి   కళ్ళు మూసే దైవ భావన పైన, దాని తాత్వికత పైన వారు   ప్రశ్నల తూటాలు సంధించారు. ప్రాచీనకాలంలో భౌతికవాదాన్ని ప్రచారం చేసిన త...

'వేకువపిట్ట' పై ప్రస్థానం

Image

'వేకువపిట్ట' పై అరుణతార

Image

ఆంధ్ర జ్యోతి 'వేకువ పిట్ట' సమీక్ష

Image

prajasakti on 'Vekuva pitta' ప్రవీణ్ వెలువోలు

Image

Aranya Krishna on 'Vekuva Pitta' in Matruka

Image
సందేశాత్మక వేకువ పిట్ట! అరణ్యకృష్ణ   ఇంతటి సామాజిక దుఃఖాన్ని , ఆక్రోశాన్ని నింపుకున్న కవిత్వాన్ని ఈ మధ్య కాలంలో చదవలేదు.   ఇందులో ఉన్నది సానుభూతి కాదు , సహానుభూతీ కాదు.   ఉన్నదల్లా గుండెపగుళ్ళ అనుభవానికి అక్షర రూపమివ్వటమే.   కులానికి-వివక్షకీ , కులానికి-ఆర్ధిక దారిద్ర్యానికి వున్న అవినాభావ సంబంధాన్ని కవి తన కవిత్వంతోకి తీసుకొచ్చిన తీరు గొప్పది.   ఊరుకీ-వాడకీ మధ్యనున్న వైరుధ్యంతో కూడిన స్వానుభవాలే కవిత్వాంశాలు ఈ కవికి.   ఇది చల్లపల్లి స్వరూపరాణి కవితల సంపుటి "వేకువ పిట్ట".    **** మనం తరగతి గదుల్లో చరిత్ర అంటే ఏం చదువుకున్నాం ?   మొత్తం భరతజాతి ఒకటిగా వున్నట్లు , ఎవరో విదేశీయులు సిల్క్ రూట్లో గుర్రాలేసుకొచ్చి , లేదా సముద్రం మీద భారీ ఓడలేసుకొచ్చి ఈ దేశాన్ని దోచుకున్నట్లు మాత్రమే చదువుతాం.   కానీ ఇదే గడ్డ మీద రకరకాల సమూహాలున్నాయని , అందులో కొన్ని సమూహాలు కొన్ని వేల సంవత్సరాల తరబడి పుట్టుకని బట్టి ప్రయోజనాన్ని పొంది మరికొన్ని సమూహాల్ని అదే పుట్టుక కారణంతో దోచుకున్నాయని , హింసించాయని , ఆ దోచుకునే కారణానికి , వివక్షక...

Ganteda Gowrunaidu on 'Vekuva pitta'

Image
తానే ఒక వేకువ పిట్టయి గంటేడ   గౌరు నాయుడు అమ్మ చీర కొంగు నుంచి ప్రపంచాన్ని చూసి కవిత్వం చెప్పడమంటే గుండె ఘోషను ఆవిష్కరించడమేనని, ఆత్మగౌరవ పరిరక్షణ, ఆత్మగౌరవ ప్రకటన అని, జీవితమే కవిత్వానికి ముడిసరుకుగా స్వీకరించి తనదైన అను భూతిని అక్షరీకరించి తన అక్షరాల్ని మన కళ్ళలో ఎర్రజీరలుగా, అశృధారలుగా మార్చగలిగే సక్తివంతురాలైన కవిగా సాక్షాత్కరిస్తుంది చల్లపల్లి స్వరూపరాణి. దళిత ఉద్యమం కుల, వర్గ అణచివేత గురించి మాట్లాడిందని, దళిత పురుషుల కోణం నుంచి ఎక్కువగా మాట్లాడిందని, స్త్రీవాద ఉద్యమం మధ్య తరగతి అగ్రకుల మహిళల గురించే మాట్లాడిందని అనుకుంటే పీడితులలోకెల్లాపీడితులైన దళిత మహిళా తన గురించి తానూ మాట్లాడవలసిన అవసరాన్ని గుర్తించి తన అనుభవ తీవ్రతలోంచి, అవమానాల, ఆగ్రహావేశాల్లోంచి నోరు విప్పిందని స్పష్టం చేస్తుంది ఈ వేకువపిట్ట.   ఆధిపత్య సంస్కృతే అందరి సంస్కృతి కాదని, అందరిదీ ఓకే సంస్కృతిగా మారే భవిష్యత్తును కాంక్షిస్తూ కలగంతుంది ఈ వేకువపిట్ట. “కులం, వర్గము, ఆధిపత్యము ఈ సమాజంలో ఉన్నంతవరకూ నిరంతర పోరాటం సాగుతూనే ఉంటుంది” అంటుంది ఈ వేకువపిట్ట, ఆ పోరాటాలకు ఊపిరి పోస్తుంది ఈ వేకువపిట్ట. ...