Manusruti - write up
అసమానతకు శాశ్వత చిరునామా ‘మనుస్మృతి’ చల్లపల్లి స్వరూపరాణి చరిత్రకారులు ఎంతసేపటికీ భారత్ పై మహ్మదీయుల దండయాత్రల గురించి రాయడంతో పుస్తకాలు నింపేశారని, నిజానికి హిందూ ఇండియాపై మహ్మదీయుల దురాక్రమణ కంటే అంతకు ముందు బౌద్ధ ఇండియాని బ్రాహ్మణ వాదులు దురాక్రమించారని ముస్లింలు రాకపూర్వం జరిగిన భారతదేశ చరిత్ర మొత్తం బౌద్దులకూ, బ్రాహ్మణవాదులకూ మధ్య జరిగిన సంఘర్షణే అని అంబేద్కర్ అంటారు. ఆ చరిత్రలో ‘మనుస్మృతి’ రచన ఒక ముఖ్యమైన అధ్యాయం. మనుస్మృతి ఒక మత గ్రంధమో లేక కాల్పనిక కావ్యమో కాదు. అది ఒక ‘అధర్మశాస్త్రం’ మనుస్మృతి రచనకూ భారత రాజకీయ చరిత్రతో కొంతకాలం ప్రత్యక్ష సంబంధం, మరికొంతకాలం పరోక్ష సంబంధం ఉంది. బౌద్దాన్ని ఈదేశపు సాంస్కృతిక అస్తిత్వంగా అధికారికంగా ప్రకటించిన మౌర్య అశోకుడు తన పరిపాలనను బౌద్ధ ధ...