Jogini Daughter Susila- Essay
జీవితపు ఆటలో గెలిచిన మాతంగి బిడ్డ సుశీల చల్లపల్లి స్వరూపరాణి సమాజం వారిని చిన్న చూపు చూసింది. మతం పేరుతో ఊరుమ్మడి వస్తువుని చేసింది. ఊరు బాగుండాలంటే మాతమ్మలు చిందేయాలంది. వర్షాలు కురిసి భూములు పండాలంటే మాతమ్మ పూనకం తెచ్చుకుని సిడి మాను ఎక్కాలంది. అయినా ఆమె తన స్వయం శక్తితో తన తలరాత మార్చుకుంటుంది. ఆమే పద్దెనిమిదేళ్ళ కొండా సుశీల. జాతీయ స్థాయి హాకీ క్రీడాకారిణి. ఆమె తల్లి ఒక ‘మాతంగి’, మాదిగ కులంలో పుట్టింది. ఆమెది చిత్తూరు జిల్లా, చంద్రగిరి మండలం, తొండవాడ గ్రామం. ఆమె తల్లి తన మేనమామ సహాయంతో ఆ మురికి కూపం నుంచి బైటకొచ్చి పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభించాలను...