Lakshmi Narusu
Posts
Showing posts from October, 2020
- Get link
- X
- Other Apps
యాభై యేళ్ళు దాటినాక కూడా నాన్న తాడిచెట్టు ఎక్కి తాటి కాయలు కొట్టి ఎద్దుల బండి మీద ఇంటికి తెచ్చి ఇంకొద్దు అనేదాకా మా పిల్లలందరికీ ముంజలు కొట్టి ఇచ్చేవాడు... నాన్నా! నువ్వే నా పూల పొట్లం... పూల పొట్లం దీపావళి రోజు తాటి గులకలతో చేసిన పూల పొట్లం పంగల కర్రతో బుర్రల బండి తిప్పుకోని బాల్యం నాకెందుకో చప్పగానే వుంటాది... పుస్తకం పేజీలలో దాచి పంతుళ్ళకి కనబడకుండా చప్పరించడానికి తాటి చాపలేని బడి పిల్లలు నాకెందుకో వెలితిగానే వుంటారు... కల్పవృక్షం ఏమేమి చేస్తదో తెలీదు గానీ తాటి చెట్టు మాబతుకంతా కాసి అడక్కుండానే అన్నీ సమకూర్చి పెట్టే చల్లని తల్లి... ఎండకీ వానకీ బెదరాకుండా నిటారుగా నిలబడమని మౌనంగా హెచ్చరించే నాన్న... చేత్తో చెంబుడు నీళ్ళు పొయ్యకపోయినా నొచ్చుకోకుండా జలజలలాడే ముంజలు, కమ్మటి పండు తాటి చెక్కలతో కడుపునింపే పేదరాసి పెద్దమ్మ... బతికుండగా అన్నీ ఇచ్చిందికాక తన శక్తి గుజ్జు చీకి పారేసినా చచ్చిపోయి తేగగా మాకోసం తిరిగొచ్చే జీవలక్షణం తాడి చెట్టుకే తెలుసు... మా నల్...
- Get link
- X
- Other Apps
ఆకురాలు ఋతువు చల్లపల్లి స్వరూపరాణి అమ్మా! ఒక్కసారన్నా నీమాట విననందుకు నీ కొడుకు రోహిత్ ని క్షమించమ్మా! నలుగురు నడిచే దారిలో తలొంచుకు నడవనందుకు కుడి చేతికి ఎడమ చేతికి తేడా లేదన్నందుకు నన్ను మన్నించమ్మా! పరిధులలో ప్రమేయాలలో ఒదగనందుకు సున్నం కొట్టిన సమాధి లోకంలో ఊపిరాడక ఉసురుసురన్నందుకు నన్ను క్షమించవూ! కంచెల్ని దాటి నా కళ్ళు నక్షత్రాలని చూసినందుకు దగాకోరు రంగుల్ని చీల్చి నలుపు రంగుని ముద్దాడినందుకు అమ్మా! నన్ను క్షమిస్తావు కదూ! పొయ్యి మీదకీ పొయ్యికిందకీ జరగటానికి నీ వొళ్ళు గుల్లచేసుకోటం కళ్ళతో చూసి కూడా మంచి ఉద్యోగం తెచ్చుకుని నీ కాళ్ళు కందకుండా చూసుకోలేని ఈ ‘కటికోడిని’ తిట్టుకోవద్దమ్మా! నీమీద ప్రేమలేక కాదు నా కళ్ళున్నాయి చూడు, అవి ఇంటిని దాటి సమాజంలోకి సమాజాన్ని దాటి భూదిగంతాల వరకూ నడిచి వెళ్ళాయి అమ్మా! ఒక్క రోజన్నా నీమాట ఆలకించనందుకు నన్ను క్షమించమా! మగతోడు లేక లోకంలో ఎన్ని నిందలు మోశావు ఎండకీ వానకీ తడిసినా తిండికీ గుడ్డకీ నమిసినా బతుకు ఎలమీద తెగించి ను...
- Get link
- X
- Other Apps
ప్రవహించే కల చల్లపల్లి స్వరూపరాణి ఒక తెల్లటి బూటుకాలు తరాలనుంచి మెడ నరాలమీద అదిమివుంచినా ఆకాశమంత స్వేచ్ఛగా గాలిపీల్చుకోవాలని నా శతాబ్దాల కల ఈ ఉచ్చిష్టపు రొదలో కదులుతూనే వుంది. వూపిరాడనితనంలో ఆహ్లాదాన్ని కలగనడం నాకిష్టమైన దినచర్య... ఆరంగుకే మచ్చ తెచ్చిన తెల్ల తోలూ! మనిషి నెత్తురు మరిగిన తెల్ల పులివి కదా! గొంతు నులమడం కలల్ని చిద్రం చెయ్యడం తప్ప నీకేం తెల్సు! నువ్వు అందరిముందూ జబ్బలు చరుచుకునే ప్రగతి అంతా నా చెమట కష్టంతో పోగు చేసింది కాదా చెప్పు! అయినా, ఇంకా గుక్కెడు మనిషితనం కోసం నాజాతి గసపెడుతూనే వుంది. నెత్తుటి మడుగుమీద నిలబడి శాంతి గీతమాలపించే నాటకాలమారి తెల్ల పావురమా! అన్ని రంగుల్నీ నీలో ఇముడ్చుకున్నావని ఎవరన్నారు? సమస్త రంగుల చేపల్నీ దిగమింగి బ్రేవుమని తేన్చిన తిమింగలం నీపేరు తెలుపంటే ఓ లాఠీ కర్రని నలుపంటే మట్టిచేతుల కష్టం అనీ నిన్నూ నన్నూ చూసిన ప్రపంచం అర్ధం చేసుకుంది. నీ నంగిరి పింగిరితన...